మల్కాజ్ గిరి లో రేవంత్ రెడ్డి గెలుస్తారా ?

ఎవ్వరూ ఊహించని రీతి లో కొడంగల్ లో ఓటమి చవి చూసిన రేవంత్ రెడ్డి పార్లమెంట్ భరిలో మల్కాజ్గిరి అభ్యర్ది గా కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు . ఫైర్ బ్రాండ్ గా , ధైర్యం ఉన్న నాయకుడిగా మంచి గుర్తింపు రేవంత్ రెడ్డి గారికి ఉంది . సమస్యల పరిష్కారానికి అధికార పక్షాన్ని నిలదీసే దమ్ము ఉన్న నాయకుడు .

అధికార పక్ష్యం ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ MLA లను వారి పార్టీ లోకి ఆహ్వానించారు . ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ లో రేవంత్ రెడ్డి లాంటి బలమైన నాయకుడు గెలువ వలసిన అవసరం ఉంది .

రేవంత్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉందా ?

ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది . ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలకు , అసెంబ్లి ఎన్నికలకు చాలా తేడా ఉంది . ఇవి జాతీయ స్తాయి ఎన్నికలు , సమీకరనాలు భిన్నం గా ఉంటాయి . మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధి లో ఎక్కువగా చదువుకున్న విద్యార్దులు , మరియు దేశం లో అన్ని ప్రాంతాలలో సెటిలర్స్ ఇక్కడ ఉంటారు . వాళ్ళని మభ్య పెట్టడం అంత సులువైన విషయం కాదు . అందులో రేవంత్ రెడ్డి లాంటి బలమయిన నాయకుడు గెలవడం వలన అధికార పక్షం లోని కొన్ని వర్గాల వారికి కూడా లాభం చేరే అవకాశం ఉంది . రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి  అభ్యర్ది గా ఉండటం వల్ల , అక్కడ TRS నుండి ఎవరిని పోటీ లో పెట్టాలో అర్దం కానీ పరిస్తితి లో KCR ఉన్నారు .

ఏ కోణం నుండి చూసిన మల్కాజ్ గిరి పార్లమెంట్ నుండి ఈసారి రేవంత్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయి . కాంగ్రెస్ జెండా ఎగరడం తద్యం .

Updated: March 20, 2019 — 4:37 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *